మొదటి పేజీ

ఈ వారపు వ్యాసం
శ్రీ సత్యనారాయణస్వామి దేవస్థానం (అన్నవరం)

శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా లోని అన్నవరం పట్టణంలో ఉన్న హిందూ-వైష్ణవ దేవాలయం. ఈ ఆలయం రత్నగిరి అనే కొండపై ఉంది. విష్ణువు అవతారమైన వీర వెంకట సత్యనారాయణకు ఈ ఆలయం అంకితం చేయబడింది. స్థలపురాణం ప్రకారం పర్వతశ్రేష్ఠులలో ఒకడైన మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీమహావిష్ణువు గురించి తపం ఆచరించి విష్ణువు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందుతారు. ఒకడేమో భద్రుడు, ఇంకొకడు రత్నకుడు. భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థానమైన భద్రాచలంగా మారుతాడు. రత్నకుడు అనే ఇంకో కొడుకు కూడా విష్ణువు గురించి తపమాచరించి మెప్పించి, మహావిష్ణువు శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామిగా వెలసే రత్నగిరి కొండ, లేదా రత్నాచలం కొండగా మారుతాడు. తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురానికి సమీపంలో గోరస గ్రామ ప్రభువు రాజా ఇనుగంటి వేంకటరామారాయణిం బహద్దూరు ఏలుబడిలో అరికెంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది. అక్కడ ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను మహా భక్తుడు. ఒకనాడు శ్రీమహావిష్ణువు ఇతనికి, రాజా ఇనుగంటి వేంకటరామారాయణిం బహద్దరు వారికీ ఏక కాలంలో కలలో కనపడి "రాబోవు శ్రావణ శుక్ల విదియ, మఖ నక్షత్రం, గురువారం నాడు రత్నగిరిపై వెలుయుచున్నాను. నీవు నన్ను శాస్త్రనియమానుసారం ప్రతిష్టించి సేవించుము" అని చెప్పి మాయమయ్యారని కథనం.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

చరిత్రలో ఈ రోజు
జనవరి 4:
ఈ వారపు బొమ్మ
రష్యాలో నూతన సంవత్సర వేడుకల అలంకరణ

రష్యాలో నూతన సంవత్సర వేడుకల అలంకరణ

ఫోటో సౌజన్యం: Alexander Novikov


సోదర ప్రాజెక్టులు
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
వికీసోర్స్ 
మూలాలు 
వికీడేటా 
వికీడేటా 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
విక్షనరీ 
శబ్దకోశం 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.
భాష
  NODES