ఆనాటి కాలమునుండి మానవుడు తన జీవితమును సౌఖ్యానందమొనరించుటకై అనేక కృత్యములు ఆచరించుచున్నాడు. వీటిలో కొన్ని ఉపయోగదృష్టితోడను కొన్ని సౌందర్యదృష్టితోడను చేయబడుచున్నట్లు కానవచ్చును. ప్రతిభానైపుణ్యములకు దావలములైన వీటన్నింటిని కళలుఅని అంటారు. వీటిని వర్గీకరించి 64 కళలుగా వివరించారు.వీటిలో మొదటతెగకు చెందినవి మానవశరీర సౌందర్యమునకును,రెండవతెగకు చెందినవి మానవహృదయానందమునకును తోడ్పడును.మొదట తెగవానిని సామాన్యకళలని, రెండవ తెగవానిని లలితకళలని చెప్పుచున్నారు. కళలను 64 ‌గా ప్రాచీనులు వర్గీకరించారు. వీటిల్లో ప్రస్తుతము కొన్ని మాత్రమే ప్రాచుర్యంలో ఉన్నాయి.

రాజా రవివర్మ తైల వర్ణ చిత్రం
తెలంగాణ ప్రభుత్వం అందించే కాళోజీ నారాయణరావు సాహితీ పురస్కారంలో 2018, సెప్టెంబరు 09న హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరిగిన పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో కాళోజీ నారాయణరావు సైకత శిల్పం
  1. అగ్ని స్తంభం
  2. కావ్యం
  3. దృష్టి చనం
  4. లిపికర్మం
  5. అదృశ్యకరణం
  6. కృషి
  7. దేశభాషలిపి
  8. లోహక్రియ
  9. అలంకారం
  10. ఖడ్గ స్తంభం
  11. ధాతువాదం
  12. వయ స్తంభం
  13. అవధానం
  14. ఖనివాదం
  15. నాటకం
  16. వశ్యం
  17. అశ్వక్రియ
  18. గంధవాదం
  19. పరకాయప్రవేశం
  20. వాక్ స్తంభం
  21. అసవకర్మం
  22. గాయకత్వం
  23. ప్రాణిదూతృత కౌశలం
  24. వాక్సిద్ది
  25. అంజనం
  26. చర్మక్రియ
  27. పాదుకాసిద్ధి
  28. వాచకం
  29. అంబరక్రియ
  30. చిత్రక్రియ
  31. పాశు పాలనం
  32. వాణిజ్యం
  33. ఆకర్షణం
  34. చిత్రలేఖనం
  35. మణి మంత్రేషధాదిక సిద్ధి
  36. విద్వేషం
  37. ఆగమము
  38. చోరకర్మం
  39. మల్ల శాస్త్రం
  40. వేణుక్రియ
  41. ఇతిహాసము
  42. జలవాదం
  43. మారణం
  44. శాకునం
  45. ఉచ్చాటనం
  46. జలస్తంభం
  47. మృత్ర్కియ
  48. సర్వ వంచనం
  49. ఐంద్రిజీవితం
  50. దహదం
  51. మోహనం
  52. సర్వశాస్త్రం
  53. కవిత్వం
  54. దారుక్రియ
  55. రత్నశాస్త్రం
  56. సంగీతం
  57. కామశాస్త్రం
  58. దురోదరం జ్ఞానం
  59. రథాశ్యాగజ కౌశలం
  60. సాముద్రికం
  61. కాలవంచనం
  62. దూతీకరణం
  63. రసవాదం
  64. సూదకర్మం

భవన నిర్మాణ శాస్త్రం (ఆర్కిటెక్చర్) , లలిత కళలు (ఫైన్ ఆర్ట్స్)

మార్చు

జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ , ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం,[1] ఫైన్ ఆర్ట్స్ , డిజైన్ కామన్ టెస్ట్ ద్వారా కదిలే బొమ్మలు (యానిమేషన్), ఆప్లైడ్ ఆర్ట్స్, ఫొటోగ్రఫీ, చిత్రలేఖనం,శిల్పం, ఇంటీరియర్ డిజైన్లో డిగ్రీ కోర్సుల ఎంపిక జరుగుతుంది.

సంగీత , నృత్యం

మార్చు

సర్టిఫికేట్, డిప్లొమా స్థాయి

మార్చు

సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 12 ప్రభుత్వ సంగీత , నృత్య పాఠశాలలు/కళాశాలలో సర్టిఫికేట్ డిప్లొమా స్థాయిలో కోర్సులు ఉన్నాయి. కర్నాటక గాత్రం, వీణ, వయోలిన్,మృదంగం, నాదస్వరం,డోలు,కూచిపూడి, భరతనాట్యం కోర్సు విషయాలుగావున్నాయి.సాధారణంగా జూన్ మాసంలో దరఖాస్తులు ప్రకటన వెలువడుతుంది. ఉ 7 గంటలనుండి 9:30 గంటలవరకు, సా 4 గంటలనుండి 6:30 గంటలవరకు బోధన జరుగుతుంది.

సర్టిఫికేటు

అర్హత: జూలై 1 కి, 10 సంవత్సరాల వయస్సుగలిగి వుండాలి.

డిప్లొమా

అర్హత: జూలై 1 కి, 15 సంవత్సరాల వయస్సుగలిగి వుండాలి. సర్టిఫికేటు కోర్సు ఉత్తీర్ణత

సంస్థలు

చూడండి: సంగీత నృత్య కళాశాల
12 క‌ళాశాలలున్నాయి. ఇవి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయముకు అనుబంధమై ఉన్నాయి.

దూరవిద్య

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము దూరవిద్యా కేంద్రములో సంగీత విశారద కోర్సు ఉంది.

డిగ్రీ, పిజి డిప్లొమా స్థాయి

మార్చు

బిఎ కర్ణాటక సంగీతం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము దూరవిద్యా కేంద్రము ద్వారా అందచేస్తున్నది.

ఉపాధి

మార్చు

స్వయం ఉపాధితో బాటు, వివిధ ప్రచార/సమాచార సాధనాలు/మాధ్యమాలలో ఉపాధి అవకాశాలున్నాయి.

ఇవీ చూడండి

మార్చు

వనరులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=కళలు&oldid=4351057" నుండి వెలికితీశారు
  NODES
languages 1