బల్లి

(బల్లులు నుండి దారిమార్పు చెందింది)

బల్లి (ఆంగ్లం Lizard) ఒక సరీసృపము.

Lizards
Temporal range: జురాసిక్ - Recent
Central bearded dragon, Pogona vitticeps
Scientific classification
Kingdom:
Phylum:
Superclass:
Class:
Order:
Suborder:
Günther, 1867

బల్లులలో రకాలు

మార్చు

ఈ బల్లులు సాధారణంగా ఇళ్లలో వుంటాయి. ఇంట్లో లైట్ల వద్ద తిరిగే పురుగులను తిని బతుకు తుంటాయి. బల్లి గురించి చాల అపోహలున్నాయి. ఇది విష పురుగు అని అంటే అది కరవదు అని, కొన్నిసార్లు అది కరుస్తుంది ...... గాని అది ఇళ్లలో తిరుగుతుంటుండి గనుక అది ఏదేని ఆహార పదార్థాలలో పడితే దాన్ని తిన్న వారు మరణిస్తారని ప్రజల్లో ఒక ఆపోహ ఉంది. అదే విధంగా బల్లి మన శరీరంపై ఏబాగాన పడితే దానికి ఫలితమేమిటి తెలుసుకునే బల్లి శాస్త్రము కూడా ఉంది. కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో వున్న బంగారు బల్లిని ముట్టుకున్న వారికి బల్లి వారి దేహంపై ఎక్కడ పడినా దుష్ఫలితం వుండదని నమ్మిక. అదే విధంగా బల్లి శరీరం మీద పడిన వారు..... కంచిలోని బంగారు బల్లిని ముట్టుకొని వచ్చిన వారి పాదాలకు నమస్కారము చేస్తే బల్లి పడిన దుష్ఫలితం వుండదని కూడా ప్రజల్లో ఓ ప్రగాఢ నమ్మకముంది. మనమేదన్నా తలుచు కుంటున్నప్పుడు బల్లి పలికితే అది నిజమవుతుందని కూడా నమ్ముతారు. అది పలికి నపుడు "క్రిష్ణ... క్రిష్ణ " అని అంటారు. చాల గుడుల గోడల మీద బల్లుల చిత్రాలున్నాయి.

బల్లిపాటు గురించిన నమ్మకాలు

మార్చు
స్కింక్ తోక ఆటోటోమీ తర్వాత కదలడం కొనసాగుతుంది

మనశరీరము మీ పొరబాటున బల్లిపడి యడల కలుగు శుభాశుభములను తెలియ జేయునది బల్లి శాస్త్రము [1] ఇది పురుషులకు, స్త్రీలకు విడివిడిగా ఫలితములు ఇచ్చును.[ఆధారం చూపాలి]

పురుషులకు కలుగు శుభాశుభములు

మార్చు
  • తలమీద = కలయము,
  • బ్రహ రంద్రమున = మరణము
  • ముఖము = ధనలాభము
  • ఎడమ కన్ను = శుభం
  • కుడికన్ను = అపజయము
  • నుదురు = బంధు సన్యాసము
  • కుడి చెవి = దుఖము
  • ఎడమచెవి = లాభము
  • పై పెదవి = కలహము
  • క్రింది పెదవి = ధన లాభము
  • రెండు పెదవులపై = మృత్యువు
  • నోటియందు = రోగ ప్రాప్తి
  • ఎడమ మూపు = జయం
  • కుడి మూపు = రాజ భయం
  • మణికట్టు = అలంకార ప్రాప్తి
  • మోచేయి = ధన హాని
  • వ్రేళ్ళపై = స్నేహితుల రాక
  • కుడిభుజము = కష్టము
  • ఎడమ భుజము = అగౌరవము
  • తొడలు = వస్త్ర నాశము
  • మీసములపై = కష్టము
  • పాదములు = డబ్బు లాభం
  • పాదముల వెనుక = ప్రయాణము
  • కాలి వేళ్ళు = రోగ పీడనము.

స్త్రీలకు కలుగు శుభశుభములు

మార్చు
  • తలమీద = ఎం ఉండదు
  • కొప్పుపై= రోగ భయం
  • పిక్కలు = బంధు దర్శనము
  • ఎడమ కన్ను = భర్త ప్రేమ
  • కుడికన్ను = మనో వ్వథ
  • వక్షము = అత్యంత సుఖము, పుత్ర లాభము.
  • కుడిచెవి = ధన లాభము
  • పైపెదవి = విరోదములు
  • క్రింది పెదవి = సూకగ వస్తు లాభము
  • రెండు పెదవులు = కష్టము
  • స్థనము నందు = అధిక దుఃఖము
  • వీపునందు = మరణ వార్థ
  • గోళ్ళయందు = కలహము
  • చేతియందు = ధన నష్టము
  • కుడిచేయి = ధన లాభము
  • ఎడమ చేయి = మనో చలనము
  • వ్రేళ్ళపై = భూషణ ప్రాప్తి
  • కుడి భుజము = కామ ప్రాప్తి
  • ఎడమ భుజం = దన లాభం
  • తొడలు = కామ కోరికలు ,
  • మోకాళ్ళు = బంధనము,
  • చీలమండలము = కష్టము
  • కుడికాలు = శత్రు నాశనము
  • కాలి వేళ్ళు = పుత్ర లాభము.
  1. "'బల్లి శాస్త్రం ' Balli Sastram for male and Female". Teluguaction. 2024-03-13.
"https://te.wikipedia.org/w/index.php?title=బల్లి&oldid=4164017" నుండి వెలికితీశారు
  NODES
Done 1