శకం
శకం లేదా శకము అనేది కాలగమనం లేదా చరిత్ర రచన యొక్క ప్రయోజనాల కోసం నిర్వచించిన సమయ వ్యవధి. చారిత్రక ప్రాధాన్యమత, భౌగోళిక ప్రాంతములను బట్టి శకములు అనేకం ఏర్పడినవి. ఏక కాలంలో వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు శకములు కూడా ఏర్పడినవి. ప్రపంచవ్యాప్తంగా అధికంగా క్రీస్తుశకమును ఉపయోగిస్తున్నారు. పూర్వం భారతదేశంలో విక్రమ శకం, శాలివాహన శకం మంచి ప్రాధ్యానమును సంతరించుకొని నేటికి ఉపయోగించబడుతున్నాయి.
శకములు ఏర్పడిన సందర్భములు
మార్చుక్రీస్తుశకం - క్రీస్తు జననం నుంచి
విక్రమశకం - విక్రమాదిత్యుడు పట్టాభిషిక్తుడైన నాటి నుంచి (క్రీ.పూ. 57)
శాలివాహనశకం - శాతవాహనులలో ప్రముఖుడైన హాలశాతవాహనుని రాజ్యకాలంలో శకనులపై విజయం సాధించినప్పటి నుండి (సా.శ. 78)
విక్రమ శకం
మార్చువిక్రమ్ శకం లేదా విక్రమ్ సంవత్ అనేది క్రీ.పూ 57 లో ప్రారంభమైన భారతీయ క్యాలెండర్. విక్రమ్ సంవత్ క్యాలెండర్ గ్రెగోరియన్ కేలండర్కు అర్ధ శతాబ్దం ముందు మొదలయ్యింది, భారతీయ క్యాలెండర్ చక్రాన్ని పనిచేయించింది. ప్రస్తుత సా.శ. క్రీ.పూ గ్రెగోరియన్ క్యాలెండర్ విక్రమ్ సంవత్ క్యాలెండర్ నుండి ఎంతో ప్రేరణ పొందింది.
ప్రస్తుత విక్రమ్ సంవత్ సంవత్సరం 2072!
ఈ విక్రమ్ సంవత్ క్యాలెండర్ అనేది రాజా విక్రమాదిత్య ఉజ్జయినీ సామ్రాజ్యాన్ని ముట్టడి చేసి సాకాలును ఓడించి విజయం సాధించినందుకు గౌరవార్థంగా ఈ తేదీ రోజున ప్రారంభించబడినట్లు గుర్తింపు పొందింది.