—అని పార్వతి విదేశాల్లో చదువు ముగించుకొని తిరిగివచ్చిన దేవదాసుని చిలిపిగా ప్రశ్నించే ఈ పాట[1] అప్పటి భారతీయ సంపన్న వర్గాలపై పాశ్చాత్య సంస్కృతి (ప్రత్యేకించి దుస్తుల) యొక్క ప్రభావం ఏ స్థాయిలో ఉండేదో (ఇప్పటికీ అన్ని వర్గాలపై ఉందో) చెప్పకనే చెబుతుంది!!!

1906 లో కాలర్డ్ షర్ట్, నెక్ టై, వెయిస్ట్ కోట్, పీక్ ల్యాపెల్డ్ కోట్ గల సూట్ ని ధరించిన గాంధీ
ఓ దేవదా!

చదువు ఇదేనా? మన వాసి వదిలేసి,
అసలు దొరల్లే సూటూ బూటా? '

దేవదాసు (1953 సినిమా) చిత్రంలో పాట భాగం

సూటు అనగా ఒకే వస్త్రంతో కుట్టిన వివిధ వస్త్రాల సముదాయము. ఈ సముదాయంలో కనీసం కోటు (పురుషుల జాకెట్), ట్రౌజర్సు ఉంటాయి.

సూటు యొక్క డిజైను, దానిని కత్తిరించే విధానము, ఉపయోగించే వస్త్ర రకము, రెండు-భాగాల/మూడు భాగాల, సింగిల్/డబుల్ బ్రెస్ట్ అనునవి సందర్భాన్ని/వాతావరణాన్ని బట్టి ఉంటాయి.

సూట్లు తరచుగా కాలర్ కలిగిన షర్టులు, నెక్ టై లతో ధరిస్తారు. రెండు భాగాల సూట్ లో కేవలం జాకెట్, ట్రౌజర్సు, అదే మూడు భాగాల సూట్ లో అయితే వెయిస్ట్ కోట్, ఒక్కో మారు ఫ్ల్యాట్ క్యాప్ కూడా చేరతాయి.

చరిత్ర

మార్చు

ప్రస్తుతము వాడే సూట్లు 19వ శతాబ్దపు ప్రారంభంలో కనుగొనబడ్డాఅయి. అప్పటి వరకు ఉన్న భారీ ఎంబ్రాయిడరీలు, ఖరీదైన నగలు గల సూట్ ల నుండి సరళంగా ఉండే బ్రిటీషు రీజెన్సి కాలపు శైలికి రూపొంది విక్టోరియన్ కాలము నాటికి పూర్తి జనాదరణ పొందినాయి. సౌకర్యం కోసం వదులును పెంచటం 19 వ శతాబ్దపు ద్వితీయార్థంలో జరిగింది.

తయారీ

మార్చు

సూట్ ల తయరీ ప్రాథమికంగా మూడు విధాలు

  • బెస్పోక్ - వినియోగదారుడిచే ఎన్నుకొన్న వస్త్రాలని అతని అభిరుచులకి అనుగుణంగా దర్జీ కుడతారు. ఈ విధానంలో వినియోగదారుడికి అత్యధిక స్వేచ్ఛ ఉండటంతో బాటు దుస్తులు సరిగ్గా నప్పుతాయి
  • మేడ్-టు-మెజర్: ఒక స్థాయి వరకు ముందే కుట్టబడి ఉన్నాయి. తర్వాత కొన్ని మార్పులని చేర్పులని చేసుకొనవచ్చును
  • రెడీ టు వేర్: అత్యల్ప ధర గలది, కావునే అతి సాధారణమైనది

సూట్ లోని భాగాలు

మార్చు

కట్ (కత్తిరించే విధానం)

మార్చు

బొత్తాలు పెట్టుకున్ననూ అసౌకర్యంగా ఉండకుండా, బొత్తాలు పెట్టుకోకున్ననూ వ్రేలాడినట్టు కనబడకుండా సూటు మరీ బిగుతుగా గానీ, మరీ వదులుగా గానీ లేకుండా ఒంటి పై చక్కగా అమరేలా కత్తిరించవలసి ఉంటుంది.

ఫ్యాబ్రిక్ (తయారీకి ఉపయోగించే వస్త్రం)

మార్చు

ఈ క్రింది వస్త్రాలు సూట్ ల తయారీలో ఉపయోగిస్తారు.

  • ఉన్ని
  • పట్టు
  • లినెన్

వెంట్

మార్చు

కోటు క్రింది భాగంలో కత్తిరించినట్టు ఉన్న భాగం. ఇవి మూడు రకాలు.

  • వెంట్ లెస్: అసలు వెంట్ ఉండదు (ఇటలీ శైలి)
  • సింగిల్-వెంటెడ్ స్టైల్: వెనుక వైపు ఒకే ఒక వెంటు ఉంటుంది
  • డబుల్ వెంటెడ్ స్టైల్: నడుముకిరువైపులా రెండు వెంట్లు (బ్రిటీషు శైలి)

డిన్నర్ జాకెట్ కి యే శైలిలోనూ వెంట్ లు ఉండవు

పురుషులు తమ షర్టు పై వెచ్చదనానికి, ఫ్యాషన్ కి వేసుకొంటారు. సాంప్రదాయికంగా ప్యాంటు గుడ్డనే సూటులో భాగంగా కుడతారు.

పాకెట్ స్క్వేర్

మార్చు

కోటి పై భాగంలో ఉన్న జేబులో రుమాలు వలె మడిచి పెట్టే చిన్నపాటి గుడ్డ. ఇది కేవలం అలంకారప్రాయం. దీనిని ఎట్టి పరిస్థితులలో రుమాలు వలె ఉపయోగించరు. ఇది ఐచ్ఛికం.

 
వెయిస్ట్ కోట్ ధరించిన నిర్మాత-దర్శకుడు-రచయిత, భారతీయ సినిమా పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే

వెయిస్ట్ కోట్ అనునది సూట్ లోని ఒక భాగము. ఇది చొక్కా పైన, కోటు లోపల వేసుకొనే ఒక చేతులు లేని (స్లీవ్ లెస్) కోటు. దీని ముందు భాగం బయటికి కనబడుతుంది కాబట్టి ఒక వస్త్రంతోను వెనుక భాగం కనబడదు కాబట్టి దానిని ఇంకొక వస్త్రంతోను కుడతారు. దీనికి కాలరు గానీ, ల్యాపెల్ గానీ ఉండవు.

  • ఇంగ్లీష్ షర్ట్: ఇవి మొదటి తరం షర్టులు. ఇవి ఇప్పుడు వేసుకొనే మామూలు షర్టు వలెనే కానీ బొత్తాలు మాత్రం టి-షర్టు లకు ఉన్నట్టు ఛాతీ వరకు మాత్రం ఉండేవి. వీటి ధారణ కూడా టి-షర్ట్ ధారణ వలెనే ఉండేది. వెనుక ప్లీటులు వీపు మధ్య భాగం వద్ద దగ్గరగా కాకుండా బాగా ఎడంగా ఉండేవి. ధరించే సమయంలో ఇస్త్రీ నలిగే అవకాశం ఎక్కువగా ఉండటం, ధరించే విధానం కష్టతరంగా ఉండటం వంటి వాటి వలన తర్వాతి కాలంలో అమెరికన్ షర్ట్ లు జనాదరణ పొందాయి. ప్రస్తుతం ఇంగ్లండు వారు కూడా అమెరికన్ షర్ట్ల పైనే మొగ్గు చూపటం విశేషం.
  • అమెరికన్ షర్ట్: కాలరు వద్ద నుండి క్రింద వరకు బొత్తాలు కలది. ఇంగ్లీష్ షర్ట్ తో పోలిస్తే వీటి వినియోగం, ధారణ, ఇస్త్రీ సులభం. అమెరికన్ షర్ట్ వచ్చిన తర్వాత షర్టులలో (కాలరులలో తప్పితే) పెద్ద తేడాలు కనబడలేదు. బిగుతు షర్ట్ లకి చిన్న కాలర్లు, బెల్ బాటం ప్యాంట్ల కాలంలో చాలా పెద్ద (భుజాల వరకు వచ్చే పాయింటెడ్, రౌండెడ్) కాలర్లు, ప్యారలెల్ ప్యాంట్ల సమయంలో బటన్ డౌన్ కాలర్ల వంటి స్వల్ప మార్పులు మాత్రం కనబడ్డాయి.

కాలర్ చుట్టూ అలంకార ప్రాయంగా కట్టుకునే రిబ్బను వంటి గుడ్డనే నెక్ టై అంటారు . కాలరు విధానం, వాతావరణం, వ్యక్తిగత అభిరుచులని బట్టి టై నాట్ (ముడి) ఉంటుంది. కాలరు వద్దనున్న గుండీని పెట్టుకొన్నచో ఇది సాంప్రదాయికం అవ్వగా, అదే గుండీని విప్పేసి, వదులుగా తగిలించుకొన్నచో ఇది అసాంప్రదాయికం అవుతుంది. టై నాట్ లు పలు రకాలుగా ఉన్ననూ భారతదేశంలో ఈ క్రింది నాట్ లనే ఎక్కువగా కడతారు.

  • స్మాల్ లేదా ఓరియెంటల్
  • ఫోర్ ఇన్ హ్యాండ్
  • హాఫ్ విండ్సర్
  • (ఫుల్/డబల్) విండ్సర్
 
1920 లో విద్యార్థి దశలో బౌ టై ధరించిన సుభాష్ చంద్ర బోస్.

బౌ టై, ఒక రకమైన పురుషుల నెక్ టై. రిబ్బను వంటి ఈ అలంకారం కాలరు మధ్యకి ఇరు వైపులా అతికినట్లు ఉంటుంది. ముందే కట్టి ఉంచిన రెడీ-టైడ్ బౌ టైలతో బాటు, స్వయంగా కట్టుకునే సాంప్రదాయిక సెల్ఫ్-టై, "టై-ఇట్-యువర్సెల్ఫ్ " లేదా "ఫ్రీ స్టయిల్ " బౌ టైలు కూడా లభ్యమవుతాయి. దుస్తులను తయారు చేసే పట్టు, పాలిష్టరు, నూలు లేదా వీటి కలయికలతో బౌ టై లను తయారు చేస్తారు. అరుదుగా వీటి తయారీలో ఉన్నిని కూడా వినియోగిస్తారు.

 
మొదటి తరం ప్యాంటు, వివిధ భాగాలు

మగవారు/ఆడవారు నడుము నుండి పాదాల వరకు తొడుక్కొనే వస్త్రము. ఇది లావుగా ఉండే గుడ్డతో తయారుచేస్తారు. ఇది సూటు లోని ఒక భాగమైననూ, సూటు యొక్క ఇతర భాగాలైన నెక్ టై/బౌ టై, కోటు లేకున్ననూ, కేవలం షర్టుతో బాటు దీనిని వేసుకొనవచ్చును. చాలా వరకు భారతీయులు (, ఇతర ఉష్ణ దేశస్థులు) కేవలం షర్టు ప్యాంటు లతోనే కనబడతారు. ప్యాంటులో సగం మాత్రం అనగా తొడల వరకు ఉండే వస్త్రాన్ని నిక్కరు అంటారు. బెర్మూడా వంటి దేశంలో ప్యాంటుకి బదులుగా మోకాళ్ళ వరకు ఉండే సాంప్రదాయిక నిక్కరులని సూటుతో వేసుకొనగా, స్కాట్లండ్, ఐర్లండ్ వటి దేశాలలో ప్యాంటుకి బదులుగా స్కర్టుని కూడా వాడతారు.

ఒక్కోమారు ప్యాంటుకి బదులుగా మోకాళ్ళ వరకు వదులుగా ఉండే నికర్ బాకర్స్ని ధరిస్తారు.

సాంప్రదాయికాలని ట్రౌజరు (ఉదా: ప్లీటెడ్ ట్రౌజర్సు) అనీ అసాంప్రదాయికాలని ప్యాంటు (ఉదా: లో-వెయిస్టెడ్ ప్యాంటు) అనీ పూర్వం వ్యవహరించేవారు. కానీ కాలక్రమేణా ఇవి రెండూ ఒకటే అయినాయి. ప్యాంటు అన్న పదం అన్నింటికీ వర్తించిననూ ట్రౌజరు అంటే మాత్రం సాంప్రదాయికం అనే మిగిలి పోయింది.

జీన్ గుడ్డ ట్రౌజరు గుడ్డ కన్నా ఇంకా మందంగా ఉండి ఉతకకుండా చాలా కాలం ఉపయోగించవచ్చును. సాధారణ పాంటుకు రెండు జేబులు ప్రక్కగాను ఒకటి/రెండు జేబులు వెనుకగాను ఉంటాయి. బెల్టు కట్టుకోవడానికి అనువుగా నడుం చుట్టూ రింగులు కుట్టబడి ఉంటాయి.

నికర్ బాకర్స్

మార్చు

సూట్లు ధరించిన భారతీయులు

మార్చు

సూటు ధరించినపుడు పాటించవలసిన నియమాలు

మార్చు
  • నిలబడి ఉన్నపుడు కోటు యొక్క ల్యాపెల్ వద్ద షర్టు యొక్క కాలరు పావు ఇంచి కనబడుతూ ఉండాలి. (కూర్చొన్నపుడు కోటు పైకి వెళుతుంది కాబట్టి, షర్టు కాలరు అసలు కనబడకుండా పోయే అవకాశం ఉన్నది కాబట్టి.) [2]
  • కోటు యొక్క చేతులు షర్టు యొక్క చేతులు అర ఇంచి కనబడేంత పొడవు ఉండాలి
  • కోటు యొక్క క్రింది బొత్తాము ఎప్పుడూ వదిలివేయాలి. కూర్చొన్నపుడు పై బొత్తాము కూడా తీసివేయాలి. లేకపోతే కోటు పైకి ఎగదోయబడుతుంది.
  • గజ్జల వద్ద ప్యాంటు మరీ వదులుగానో లేదా మరీ బిగుతుగానో ఉండరాదు
  • బూట్ల వద్ద ప్యాంటు ఒక మడత కన్నా ఎక్కువ పడరాదు
  • టై రంగు, షర్టు రంగుకు నప్పేలా ఉండాలి[3]
  • టై యొక్క చివరిభాగం సరిగ్గా బెల్టు యొక్క బకిల్ కంటే కొద్దిగా క్రిందకు వ్రేలాడాలి. (బెల్టు బకిల్ క్రిందకు పోరాదు)
  • టై, కోటు ల్యాపెల్ ల వెడల్పు ఒకటే అయి ఉండాలి
  • పాకెట్ స్క్వేర్ గనుక ఉపయోగిస్తే, అది టై డిజైనుకు, తయారీకి విరుద్ధమైనదిగా ఉండాలి
  • నల్లని సూట్లు కేవలం అంత్యక్రియలకు మాత్రమే ధరించాలి
  • బెల్టు, బూట్ల రంగు ఒకటే అయి ఉండాలి

సూచికలు

మార్చు

1. దేవదాసు చిత్రంలో పూర్తి పాట

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. దేవదాసు చిత్రంలో పూర్తి పాట
  2. "How to Wear a Suit". Retrieved 21 November 2016.
  3. "The Ultimate Suit Wearing Cheat Sheet Every Man Needs". Retrieved 21 November 2016.
"https://te.wikipedia.org/w/index.php?title=సూటు&oldid=3850273" నుండి వెలికితీశారు
  NODES