అమృతము (Elixir Of Life) దేవతలు, దానవులు క్షీర సాగర మథనం చేస్తున్నప్పుడు వెలువడిన పానీయం. అమృతం సేవించిన వారికి మరణం అంటే చావు ఉండదు. దీనిని విష్ణుమూర్తి మోహినీ అవతారమూర్తిగా దేవతలకు మాత్రమే పంచాడు.

క్షీరసాగర మథనం అనంతరం వెలువడిన అమృతాన్ని మోహినీ రూపంలో పంచుతున్న విష్ణువు

భాషా విశేషాలు

మార్చు

అమృతం [ amṛtamu ] a-mritamu. సంస్కృతం n. Nectar, ambrosia. Water, milk, clarified butter, the residue of a sacrifice. Final emancipation from matter and absorption in the Deity. సుధ, ఉదకము, దుగ్ధము, ఘృతము, యజ్ఞశేష ద్రవ్యము, మోక్షము, (వాడుకగా) మజ్జిగ. పంచామృతములు the five nectars, namely, water, milk, curds, ghee and honey. అమృతమునకు అంటులేదు nothing can defile buttermilk. వానిది అమృతహస్తము. he has a healing hand. వానిది అమృతవాక్కు his tongue is inspired. అమృతముహూర్తము n. An auspicious hour. శుభముహూర్తము. అమృతాంధసుడు n. One whose food is ambrosia, a god. దేవత. అమృతాంశువు n. That which gives forth soft beams of light, i.e., the Moon. చంద్రుడు.

చరిత్ర

మార్చు

ప్రాచీన కాలంలో చైనా, భారత్, కొన్ని ఐరోపా దేశాలకు చెందిన ఆల్కెమిస్టులు అమృతం లాంటి పానీయాన్ని తయారు చేయడానికి ఎంతో సమయాన్ని వెచ్చించినా నిజానికి అలాంటి పానీయాన్ని కనుగొన్నారనే విషయానికి ఆధారాలు లేవు. దీన్ని సేవిస్తే మనిషికి మరణమే ఉండదని నిత్య యవ్వనులౌతారని ప్రజలు విశ్వసిస్తారు.

చైనాలో

మార్చు

చైనా చరిత్రలో ఎందరో చక్రవర్తులు దీనికోసం ప్రయత్నించి వివిధ రకాలైన ఫలితాలను పొందారు.

భారతదేశంలో

మార్చు

హిందూ పురాణాల్లో దీన్ని అమృతంగా పేర్కొన్నారు. ఈ పానీయాన్ని ఎవరైనా కేవలం ఒక్క బిందువు సేవించినా వారికి మరణం ఉండదని ప్రస్తావించబడింది. ఈ అమృతాన్ని పొందడం కోసం దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగర మథనం చేశారు. పాల సముద్రంలో ఒక కొండనే కవ్వంగా వాసుకి అనే సర్పాన్ని తాడుగా, ఒక వైపు దానవులు, ఒక వైపు రాక్షసులు కలిసి కొన్ని సంవత్సరాలు మధించగా చివర్లో అమృతం లభించింది. కామధేనువు, కల్పవృక్షం మొదలైనవన్నీ ఈ మథనం మధ్యలో లభించినవే.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=అమృతం&oldid=3810699" నుండి వెలికితీశారు
  NODES