అమ్మాయి
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
అమ్మాయిని ఇంగ్లీషులో గర్ల్ (Girl) అంటారు. స్త్రీగా పుట్టిన బిడ్డను అమ్మాయి పుట్టింది అంటారు. పుట్టినప్పటి నుండి 12 నెలల వయసు వరకు శిశువుగా (Baby), 12 వ నెల నుండి 5 వ సంవత్సరం వచ్చే వరకు పిల్లలుగాను (Kids), 5 వ సంవత్సరం నుండి 12 సంవత్సరముల వయసు వరకు బాలిక (Girl) గాను, 12 వ సంవత్సరం నుండి 19 వ సంవత్సరంల వయసు వరకు యువతిగాను (Young Women) పిలవబడుతుంది. అమ్మాయికి పెళ్లయిన తరువాత ఆమెగా పిలవబడుతుంది అలాగే పెళ్ళి కాకుండా ఉండిపోయిన స్త్రీలను కూడా ఆమె అనవచ్చును. అమ్మాయి అనే పదాన్ని తరచుగా కుమార్తెకు పర్యాయపదంగా కూడా ఉపయోగిస్తారు.
శబ్దలక్షణం
మార్చుఆంగ్లపదం గర్ల్ (girl) మొదటిసారి సా.శ. 1250, 1300 మధ్య మధ్య యుగాలలో కనిపించింది,, ఆంగ్లో సాక్సాన్ పదాలైన gerle, girle or gurle నుండి వచ్చింది. ఆంగ్లో సాక్సాన్ పదం gerela అర్థం దుస్తులు లేదా వస్త్రాలు, ఈ అంశాన్ని కొన్ని భావాలలో పర్యాయ పదంగా ఉపయోగించారని కూడా తెలుస్తోంది.