ఆవులింత (Yawn) నిద్ర వచ్చేముందు జరిగే అసంకల్పిత చర్య. ఆవులించినప్పుడు మనం చెవులు రిక్కించి, గట్టిగా ఊపిరి పీల్చి కొంత సమయం తర్వాత విడిచిపెడతాము. ఆవులించినప్పుడు ఒళ్ళు విరుచుకుంటే దానిని పాండిక్యులేషన్ (Pandiculation) అంటారు.[1]

ఆవులిస్తున్న చంటి బిడ్డ

సామాన్యంగా అలసిపోయినప్పుడు, శారీరకమైన లేదా మానసికమైన ఒత్తిడికి లోనయినప్పుడు, ఏమీ తోచనప్పుడు ఆవులింతలు వస్తాయి. మానవులలో ఆవులింతలు ఒక విధమైన అంటువ్యాధి వంటివి. అనగా ఆవులించే వ్యక్తిని చూసినా లేదా ఆవులించడం గురించి ఆలోచించినా ఇవి ఎక్కువగా వస్తాయి.[2] ఆవులింతలు చింపాంజీ లలో మరికొన్ని జంతువులలో కూడా కనిపిస్తాయి.

ఆవులింతలకు ప్రధానమైన కారణం మెదడు యొక్క ఉష్ణోగ్రతను నియంత్రించడం అని గుర్తించారు.[3] ముందుగా భావించినట్లు ఆక్సిజన్ సరఫరా తక్కువ కావడం అన్నది నిర్ధారించలేకపోయారు.[4] నిజానికి ఆవులించినప్పుడు శరీరానికి ఆక్సిజన్ తక్కువగా అందడమే.

మూలాలు

మార్చు
  1. MedOnline.net term Archived 2007-05-02 at the Wayback Machine pandiculate
  2. Camazine, Deneubourg, Franks, Sneyd, Theraulaz, Bonabeau, Self-Organization in Biological Systems, Princeton University Press, 2003. ISBN 0-691-11624-5, ISBN 0-691-01211-3 (pbk.) p. 18.
  3. "Discovery News". Retrieved 2008-12-15.
  4. Provine RR (2005). "Yawning". American Scientist. 93 (6): 532. doi:10.1511/2005.6.532.
"https://te.wikipedia.org/w/index.php?title=ఆవులింత&oldid=3339636" నుండి వెలికితీశారు
  NODES
languages 1
mac 1
os 1