ఇంటెల్

అమెరికాకు చెందిన బహుళజాతి సాంకేతిక సంస్థ

ఇంటెల్ అమెరికాకు చెందిన బహుళజాతి సాంకేతిక సంస్థ. డెలావేర్ లో ప్రారంభమైన ఈ సంస్థ ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియాలోని శాంటాక్లారా లో ఉంది.[1] ఇంటెల్ కంప్యూటర్ పరికరాలను వ్యాపారస్తుల కోసం, వినియోగదారుల కోసం రూపకల్పన, ఉత్పత్తి చేసి విక్రయిస్తుంది. అర్ధవాహక పరికరాల (సెమీకండక్టర్) ఉత్పత్తిలో ఇది ఆదాయ పరంగా ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీల్లో ఒకటి.[2][3] 2007 నుంచి 2016 దాకా ఇది ఫార్చ్యూన్ 500 జాబితాల్లో ఒకటికా ఉంది. 2018 లో దీనిని ఆ జాబితా నుంచి తొలగించారు.[4] 2020 లో మళ్ళా 45 వ స్థానంలో చోటు సంపాదించింది.

ఇంటెల్ కంప్యూటర్లను ఉత్పత్తి చేసే చాలా సంస్థలకు మైక్రోప్రాసెసర్లను సరఫరా చేస్తుంది. చాలా వ్యక్తిగత కంప్యూటర్లో తరచుగా కనిపించే x86 ఆదేశాలను అభివృద్ధి చేసిన సంస్థల్లో ఇంటెల్ కూడా ఒకటి. అంతే కాకుండా చిప్‌సెట్లు, నెట్‌వర్క్ ఇంటర్‌ఫేస్ కంట్రోలర్లు, ఫ్లాష్ మెమరీ, గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఇంకా ఇతర కమ్యూనికేషన్ కంప్యూటింగ్ పరికరాలను తయారు చేస్తుంది.

ఇంటెల్ (ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్స్) 1968, జూలై 18న స్థాపించబడింది. సెమికండక్టర్ నిపుణుడైన గోర్డన్ మూర్, రాబర్ట్ నాయ్స్, ఇన్‌వెస్టర్ ఆర్థర్ రాక్ కలిసి ఆండ్రూ గ్రూవ్ నాయకత్వంలో స్థాపించారు.

మూలాలు

మార్చు
  1. "10-K". 10-K. Archived from the original on November 28, 2019. Retrieved June 1, 2019.
  2. Vanian, Jonathan. "Samsung Dethrones Intel As World's Biggest Chip Maker". Fortune. Archived from the original on July 29, 2017. Retrieved September 17, 2017.
  3. "Intel 2007 Annual Report" (PDF). Intel. 2007. Archived (PDF) from the original on February 5, 2018. Retrieved July 6, 2011.
  4. "Fortune 500 Companies 2018: Who Made the List". Fortune (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on నవంబరు 10, 2018. Retrieved నవంబరు 10, 2018.
"https://te.wikipedia.org/w/index.php?title=ఇంటెల్&oldid=4352008" నుండి వెలికితీశారు
  NODES
languages 1
os 1