కాల భైరవ
కాల భైరవ తెలుగు సినిమా నటుడు, గాయకుడు, సంగీత దర్శకుడు. ఆయన తెలుగు, తమిళ్, హిందీ భాషా చిత్రాలలో పాడాడు.‘బాహుబలి-2’లో అతడు పాడిన దండాలయ్యా పాట కాల భైరవకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆయన 2019లో విడుదలైన మత్తు వదలరా సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా మారాడు.[1][2]
కాల భైరవ | |
---|---|
జననం | |
వృత్తి | సంగీత దర్శకుడు, గాయకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2011- ప్రస్తుతం |
తల్లిదండ్రులు | ఎం. ఎం. కీరవాణి (తండ్రి) ఎం. ఎం.శ్రీ వల్లి (తల్లి) |
బంధువులు | శ్రీ సింహా (తమ్ముడు) ఎస్. ఎస్. రాజమౌళి (బాబాయ్) కల్యాణి మాలిక్ (బాబాయ్) |
కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ కలిసి పాడిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని 'నాటు నాటు’ పాట, 2023 మార్చి 13 న ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది.[3]
69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్‌లో ఆర్ఆర్ఆర్ (2021) సినిమాలోని కొమురం భీముడో పాటకు జాతీయ ఉత్తమ నేపథ్య గాయకుడిగా జాతీయ అవార్డుకు ఎంపికయ్యాడు.[4]
సంగీత దర్శకత్వం వహించిన సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమాలు | భాషా | గమనికలు |
---|---|---|---|
2018 | నాన్న కూచి | జీ5 సిరీస్ ; బ్యాక్ గ్రౌండ్ సంగీతం | |
2019 | మత్తు వదలరా | ||
2020 | కలర్ ఫోటో | ||
2021 | తెల్లవారితే గురువారం | [5] | |
ఆకాశవాణి | |||
లక్ష్య | తెలుగు | ||
2022 | బ్లడీ మేరీ | తెలుగు | |
హ్యాపీ బర్త్‌డే | తెలుగు | ||
మోడ్రన్ లవ్ హైదరాబాద్ | తెలుగు | అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్ | |
కార్తికేయ 2 | తెలుగు | ||
దొంగలున్నారు జాగ్రత్త | తెలుగు | ||
గుర్తుందా శీతాకాలం | తెలుగు | ||
ముఖచిత్రం | తెలుగు | ||
2023 | భాగ్ సాలే | తెలుగు | |
2024 | కృష్ణమ్మ | తెలుగు |
పురస్కారాలు
మార్చుసైమా అవార్డులు: ఉత్తమ నేపథ్య గాయకుడు
- 2017: "దండాలయ్యా" (బాహుబలి 2: ది కన్‌క్లూజన్)
మూలాలు
మార్చు- ↑ The Times of India (23 October 2019). "Kaala Bhairava to make his debut as music director - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 4 July 2021. Retrieved 4 July 2021.
- ↑ Eenadu (25 March 2021). "ఎన్టీఆర్‌తో పనిచేయడమే నా కల! - music director kalabhairava interview". www.eenadu.net. Archived from the original on 4 July 2021. Retrieved 4 July 2021.
- ↑ https://timesofindia.indiatimes.com/tv/news/telugu/natu-natu-wins-best-original-song-award-at-oscars-2023-rahul-sipligunj-and-kaala-bhairavas-performance-receives-loudest-cheer/articleshow/98595416.cms
- ↑ "National Awards 2023: జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల విజేతలు వీళ్లే". EENADU. 2023-08-24. Archived from the original on 2023-08-24. Retrieved 2023-08-24.
- ↑ TV9 Telugu (19 March 2021). "Thellavarithe Guruvaram : తెల్లవారితే గురువారం సినిమానుంచి అందమైన మెలోడీ.. సంగీతం అందించిన కాలభైరవ". Archived from the original on 4 July 2021. Retrieved 4 July 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)