కూరమిరప
కూరమిరపను ఆంగ్లంలో బెల్ పెప్పర్ అని కారం లేక పోవడంవల్ల లేదా తక్కువ కారం కలిగి ఉండడం వల్ల స్వీట్ పెప్పర్ అని అంటారు. ఈ కాయలు ఎక్కువ కండకలిగి గంట ఆకారంలో ఉండడం వల్ల దీనికి బెల్ పెప్పర్ అని పేరు వచ్చింది. బెంగుళూరు, సిమ్లా పరిసర ప్రాంతాలలో విరివిగా సాగు చేయడం వల్ల వీటిని బెంగుళూరు మిరప, సిమ్లా మిర్చి అని వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా పిలుస్తారు. ఈ మిరపకాయల్లో కారం లేకపోవడం లేదా తక్కువగా ఉండడం వల్ల వీటిని మామూలు మిరపకాయలలాగా కాకుండా కూరగాయలాగా వాడాలి. ఈ కాయలలో పోషక పదార్థాలు ఎక్కువగా ఉండడంతో పాటు విటమిన్ ఎ, విటమిన్ సి లు టమాటోలో కన్నా ఎక్కువగా ఉంటాయి. ఈ కూరమిరపను టమాటో, వంగ లాంటి పంటలు సాగుచేసే వాతావరణంలో, ప్రదేశాలలో సాగుచేయవచ్చు. బెంగుళూరు పరిసర ప్రాంతాల్లో ఏప్రిల్, మే నెలలు మినహాయించి సంవత్సరంలో ఎప్పుడైనా పంట ప్రారంభించవచ్చు. కానీ మన రాష్ట్రంలో ఎక్కువగా సాగు చేసే రంగారెడ్డి, మెదక్, హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో రబీ కాలంలో సాగుచేస్తున్నారు. పంట ప్రారంభించడానికి జూలై, ఆగష్టు, ఆక్టోబరు, నవంబరు నెలలు మంచి అదునుగా చెప్పుకోవచ్చు.
పోషక విలువలు
మార్చుNutritional value per 100 గ్రా. (3.5 oz) | |
---|---|
శక్తి | 84 కి.J (20 kcal) |
4.64 g | |
చక్కెరలు | 2.4 g |
పీచు పదార్థం | 1.7 g |
0.17 g | |
0.86 g | |
విటమిన్లు | Quantity %DV† |
విటమిన్ - ఎ | 2% 18 μg2% 208 μg341 μg |
థయామిన్ (B1) | 5% 0.057 mg |
రైబోఫ్లావిన్ (B2) | 2% 0.028 mg |
నియాసిన్ (B3) | 3% 0.48 mg |
పాంటోథెనిక్ ఆమ్లం (B5) | 2% 0.099 mg |
విటమిన్ బి6 | 17% 0.224 mg |
ఫోలేట్ (B9) | 3% 10 μg |
విటమిన్ సి | 97% 80.4 mg |
Vitamin E | 2% 0.37 mg |
విటమిన్ కె | 7% 7.4 μg |
ఖనిజములు | Quantity %DV† |
కాల్షియం | 1% 10 mg |
ఇనుము | 3% 0.34 mg |
మెగ్నీషియం | 3% 10 mg |
మాంగనీస్ | 6% 0.122 mg |
ఫాస్ఫరస్ | 3% 20 mg |
పొటాషియం | 4% 175 mg |
సోడియం | 0% 3 mg |
జింక్ | 1% 0.13 mg |
ఇతర భాగాలు | పరిమాణం |
Fluoride | 2 µg |
| |
†Percentages are roughly approximated using US recommendations for adults. Source: USDA Nutrient Database |
చిత్రమాలిక
మార్చు-
Orange bell pepper
-
A variety of colored bell peppers
-
A whole and halved red bell pepper
-
A whole purple pepper
-
Red bell peppers
-
Japanese green pepper
-
Green, yellow and red peppers
-
Quadrato d'Asti Giallo bell pepper flower
-
Secondary fruit growing inside a capsicum annuum
-
Red bell pepper as decoration