గిట్టని వారిని చంపటానికో, హానిచేయడానికో చేసే/చేయించే విద్యని చేతబడి అంటారు.వివిధ ప్రాంతాలను బట్టి దీనిని విచ్ క్రాఫ్ట్, వూడూ, బ్లాక్ మ్యాజిక్, సిహ్ర్, బాణామతి, చిల్లంగి అని కూడా అంటారు. ఇది పగ తీర్చుకోటానికి ప్రయోగించే మరో దుర్మార్గం. దీని ప్రభావం వల్లనే నష్టం జరిగిందని భావించి పగలు తీర్చుకొంటున్నారు

ఇస్లాంలో చేతబడులు

మార్చు

ఇస్లాంలో చేతబడులు వంటి నమ్మకాలు చాలా రకాలుగా ఉంటాయి. బ్లాక్ మ్యాజిక్, చెడు దృష్టి, తావీజులు మెదలగు నమ్మకాలు ఉన్నాయి. ముస్లింలు సాధారణంగా సిహ్ర్(Sihr) అనే మాయా విద్యను నమ్ముతారు, దీనిని అభ్యసించడాన్ని వ్యతిరేకిస్తారు. వీటి గురించి ఇస్లాం మతగ్రంథాలలో కూడా ప్రస్తావన ఉంది. సిహ్ర్ అనేది ఒక అరబిక్ పదం. దీని అర్థం చేతబడి లేక బ్లాక్ మ్యాజిక్. చేతబడి గురించి ఇస్లాం గ్రంథాలలో బాగా ప్రాచుర్యం పొందిన ప్రస్తావన సూరా అల్-ఫలాక్ లో ఉంది. దీని ముఖ్య విషయం ఏంటంటే చేతబడుల నుంచి కాపాడకోటానికి అల్లాహ్ ప్రార్థన ఉంటుంది.

Say: I seek refuge with the Lord of the Dawn From the mischief of created things; From the mischief of Darkness as it overspreads; From the mischief of those who practise secret arts; And from the mischief of the envious one as he practises envy. (ఖురాన్ 113:1–5)

ఖురాన్ ప్రకారం:

And they follow that which the devils falsely related against the kingdom of Solomon. Solomon disbelieved not; but the devils disbelieved, teaching mankind sorcery and that which was revealed to the two angels in Babel, Harut and Marut ... And surely they do know that he who trafficketh therein will have no (happy) portion in the Hereafter; and surely evil is the price for which they sell their souls, if they but knew. (al-Qur'an 2:102)

కొందరు ముస్లింలు జీనీల(ఒక రకమైన భూతం) సహాయంతో మాయలు చేయవచ్చని నమ్ముతారు. జీనీలు ఒక మనిషిని ఆవహించవచ్చన్నది సాధారణ ముస్లింల నమ్మకం. వీటిని వదిలించడానికి ఖురాన్ లోని కొన్ని వాక్యాలు పఠిస్తారు. జీనీల సహాయం కోరడం నిషిద్ధం, ఇలా చేయడం సైతాను సహాయం కోరడంతో సమానమని ఇస్లాం చెబుతుంది.

జీనీలు ముస్లిం నమ్మకాలలో ఒక భాగం. మహమ్మద్ ప్రవక్త ఇలా చెప్పాడు: "Allah created the angels from light, created the jinn from the pure flame of fire, and Adam from that which was described to you (i.e., the clay.)".

అంతేగాక, ఖురాన్ లో జీనీల అధ్యాయములో ఇలా ఉంది:

And persons from among men used to seek refuge with persons from among the jinn, so they increased them in evil doing.

—(The Qur'an) (72:6)

మనిషి శరీరాన్ని ఆవహించిన జీనీలను వదిలించడానికి మహమ్మదు ప్రవక్త చెప్పిన సున్నాహ్ లోని రుఖ్యాని వాడతారు. రుఖ్యాలో ఖురాన్ వాక్యాలు, భూతాలను తరిమే ప్రార్థనలు ఉంటాయి. ఈ ఖురాన్ వాక్యాలను ఏ రకంగా ఉపయోగించాలో తెలిసిన జ్ఞానము చేతబడి జ్ఞానము అంటారు.

There is a Hadeeth recorded by Al-Bukhari which narrates that one who has eaten seven dates in the morning will not be adversely affected by magic in the course of that day.

సౌదీ అరేబియా ఇప్పటికీ చేతబడి చేసే వారికి మరణశిక్ష విధిస్తుంది. 2006లో ఫాజా ఫాలిహ్ అనే వ్యక్తికి మరణశిక్ష విధించారు.[1] 2007లో ఈజిప్టుకు చెందిన ఒక వ్యక్తిని చేతబడి చేస్తున్నాడని నిర్బంధించి ఉరి తీశారు. అలాగే హజ్ యాత్రకు వచ్చిన అలీ సబాత్ అనే లెబనాన్ పౌరుడికి కూడా మరణశిక్ష విధించారు.[2]

వివరణలు

మార్చు
  • ఇన్నయ్య :మన గ్రామాలలో బాణామతి, చేతబడి, దయ్యాలు, భూతాలు, పిశాచాలు, హస్తలాఘవాలు ఇంకా ఎన్నో జనాన్ని పట్టి పీడిస్తున్నాయి. వీటి ఆధారంగా ప్రజలను ఏడిపించే మంత్రగాళ్ళు, భూతవైద్యులు, గ్రామవైద్యులు ఉండనే ఉన్నారు. అలాంటి వారికి విపరీతమైన గౌరవం యిస్తూ, వారంటే భయపడుతూ వుండడంతో, వారు యింకా వ్యాపారం చేస్తున్నారు.ఉన్నట్లుండి యింట్లో బట్టలనుండి నిప్పు వస్తుంది. ఆరుబయట ఆరవేసిన వస్త్రాలు అంటుకొని నిప్పు రాజుతుంది.ఆ సంఘటన చుట్టూ కథలు అల్లుతారు. శాంతి చేయించమంటారు. కొన్నాళ్ళు యిల్లు పాడుబెట్టమంటారు. ఎవరో చేతబడి చేయించారంటారు. దోషం పోవడానికి ఏమేమి చెయ్యాలో చెబుతారు.

ఇంటి బయట బట్టలు ఆరేయండి. పచ్చ ఫాస్ఫరస్ ఒక పాలు, కార్బన్ డైసల్ఫైడు ఆరు పాళ్లు కలపండి. కొద్దిగా బట్టలపై చల్లండి అలా చల్లింది ఆరగానే కాసేపట్లో నిప్పు అంటుకొంటుంది. ఇంట్లో అలమరలో పెట్టిన దుస్తులలోనూ యీ ద్రావకం చల్లవచ్చు. యింటిలోని వారిని ఏడిపించడానికి ఇలాంటి పనులు రహస్యంగా చేస్తుంటారు. జాగ్రత్తగా కనిపెడితే ఎవరు చేస్తున్నదీ అర్థమవుతుంది.సాధారణంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు, మూలకారణం పరిశీలించకుండా, మతపరమైన మూఢనమ్మకాల వలన భూతవైద్యుల్ని, సోది చెప్పేవారిని పిలుస్తుంటారు.

దారుణాలు

మార్చు
 
చేతబడి చేస్తున్నారనే నెపంతో ఇటీవల నల్లగొండ జిల్లా, చౌటుప్పల్ సమీపంలో దాదాపు 300 మంది కలిసి చిలివేరు నర్శింహ (60), గుడ్డేటి ఎల్లయ్య(65) అనే ఇద్దరు వృద్దులను సజీవ దహనం చేసిన దృశ్యం.[3].

చేతబడి కారణంగా దానికి చాలా సందర్భాల్లో అమాయకులు బలైపోతున్నారు.అనుమానితుల్ని చితకబాదటం, రాళ్ళతో కొట్టడం, వివస్త్రల్ని చేసి ఊరేగించడం, పళ్ళు రాలగొట్టడం, మల మూత్రాదులు బలవంతంగా తినిపించడం, చిత్ర హింసలకు గురి చేయడం జరుగుతున్నది. ఇందుకు కారణం ఊర్లో ఉండే భూత వైద్యులు కూడా.[4][5][6][7]. మన దేశంలో చేతబడి అనుమానం వల్ల హత్యకి గురవుతున్నవాళ్ళలో ఎక్కువ మంది మహిళలే. ఆ మహిళలలోనూ ఎక్కువ మంది పెళ్ళి కాని స్త్రీలు, భర్త చనిపోయిన స్త్రీలు, భర్త నుంచి విడిపోయిన స్త్రీలు.

  • మంత్రగాడనే నెపంతో నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం లోని మిట్టాపూర్ అనేగ్రామంలో గిర్నిల మల్లేష్ అనే వ్యక్తిని గొంతు కోసి గోదావరి నదిలో పడవేసి హత్య చేశారు[8]
  • విజయనగం జిల్లా, మెంటాడ మండలం, కొంకిణవలస గ్రామంలో చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో గ్రామస్థులు ఒక వ్యక్తిని కొట్టి చంపారు.[9]
  • మహబూబ్‌నగర్‌ జిల్లా బల్మూర్‌ మండలం చెన్నారం గ్రామంలో చేతబడి చేస్తున్నాడనే నెపంతో గ్రామస్థులంతా మూకుమ్మడి దాడి చేసి జి.నిరంజన్‌ (55) అనే వ్యక్తిని దారుణంగా చంపేశారు [10]
  • తన కూతురు జ్వరానికి కారణం చేతబడి చేసిందనే అనుమానంతో ఖమ్మం జిల్లా చంద్రుగొండ మండలం పెంట్లం గ్రామంలో బుల్లెమ్మ అనే మహిళ దోసిట్లో గ్రామస్థుడు తాటి నగేశ్, కె బాబూ రావు, తాటి అక్కమ్మ లతో కలిసి నిప్పులు పోశాడు[11].
  • చేతబడి చేసారనే నెపంతో ఆత్మకూరు(S), నల్గొండ జిల్లాలో భార్యాభర్తలను గ్రామస్థులు నిర్బంధించి తీవ్రంగా కొట్టారు[12]
  • కరీంనగర్ జిల్లా, మహాముత్తారం మండలంలో చేతబడి చేస్తున్నాడనే నెపంతో సమ్మయ్య అనే వృద్దుడిని హతమార్చారు.[13]
  • మంత్రాల నెపంతో ఆదిలాబాద్ జిల్లా, కాగజ్‌నగర్లో ఒక కుటుంబం పైన స్థానికులు దాడిచేశారు.[14]
  • చేతబడి నెపంతో కరీంనగర్ జిల్లా, జగిత్యాల మండలం కండ్లపల్లిలో కోలార్ జమున అనే వృద్దురాలిని చందర్ అనే వ్యక్తి కర్రలతో మోది హత్యచేశాడు.[15]
  • చేతబడి నెపంతో నిజామాబాద్ జిల్లా, బాల్కొండ మండలంలోని దూద్‍గాం శివార్లలోని నెహ్రూనగర్ వీధిలో 'యశోదా అనే వృద్దురాలిని స్థానికంగా ఉన్న ఇద్దరు యువకులు కొట్టి చంపారు..[16]

మూలాలు

మార్చు
  1. BBC News, "Pleas for condemned Saudi 'witch'", 14 February 2008 BBC NEWS
  2. "Death 'looms for Saudi sorcerer'". BBC News. 2010-04-01.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-09-19. Retrieved 2020-02-19.
  4. సాక్షి ,సూర్య 3.2.2009
  5. ఈనాడు20.10.2009
  6. ఈనాడు 18.3.2010
  7. ఈనాడు 16.9.2010
  8. http://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2010/sep/17/main/17main52&more=2010/sep/17/main/main&date=9/17/2010[permanent dead link]
  9. http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=22529&Categoryid=14&subcatid=0
  10. ఈనాడు 16.10.2010
  11. ఈనాడు 27.10.2010
  12. సాక్షి 02.11.2010
  13. http://www.sakshi.com/main/FullStory.aspx?catid=179990&Categoryid=14&subcatid=0 సాక్షి 22 జూన్ 2011
  14. http://www.sakshi.com/main/FullStory.aspx?catid=211368&Categoryid=14&subcatid=0 సాక్షి 12 ఆగస్టు 2011
  15. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-11-13. Retrieved 2020-02-19.
  16. http://eenadu.net/Homeinner.aspx?item=break81 Archived 2013-03-15 at the Wayback Machine ఈనాడు29 నవంబరు, 2012
"https://te.wikipedia.org/w/index.php?title=చేతబడి&oldid=4020555" నుండి వెలికితీశారు
  NODES