[[వర్గం:{{{year}}}_ఇంగ్లీషు_సినిమాలు]]

బ్యాంబి
Bambi

({{{year}}} ఇంగ్లీషు సినిమా)
దర్శకత్వం David Dodd Hand
నిర్మాణం వాల్ట్ డిస్నీ
రచన ఆధారంగా చేసుకొని (రాయబడిన)
Larry Morey (story adaptation)
Perce Pearce (story direction)
Gustaf Tenggren (illustration)
తారాగణం Bobby Stewart
Donnie Dunagan
Hardie Albright
John Sutherland
Paula Winslowe
Peter Behn
Tim Davis
Sam Edwards
Will Wright
Cammie King
Ann Gillis
Fred Shields
Stan Alexander
Sterling Holloway
సంగీతం Frank Churchill
Edward H. Plumb
పంపిణీ ఆర్.కే.ఓ. రేడియో పిక్చర్స్
విడుదల తేదీ ఆగష్టు 13, 1942 (అమెరికా)
నిడివి 70 నిముషాలు
దేశం అమెరికా
భాష ఇంగ్లీషు
పెట్టుబడి $2 మిలియన్ [1]
Followed by బ్యాంబి 2 (2006)

1942లో వాల్ట్ డిస్నీ చేత బ్యాంబి చిత్రం నిర్మించబడినది. ఒక జింక, దాని తల్లిదండ్రులు, స్నేహితుల పాత్రలను ఆధారంగా చేసుకొని రాయబడిన బ్యాంబి, ఎ లైఫ్ ఇన్ ద వుడ్స్ అనే నవల ఈ చిత్రానికి ఆధారం. ఈ చిత్రం మూడు ఆస్కార్ అవార్డులకు ఎన్నికయి అత్యుత్తమ యానిమేషన్ చిత్రాలలో ఒకటిగా పరిగణింపబడుతున్నది.

కథాంశం

మార్చు

ఒక ఆడజింక తాను జన్మనిచ్చిన జింక పిల్లకు బ్యాంబి అని పేరు పెడుతుంది. బ్యాంబి నడక నేర్చుకున్న తర్వాత థంపర్ అనే కుందేలును, ఫ్లవర్ అనే జంతువును మిత్రులుగా చేసుకుంటుంటాడు. ఒక రోజు తన తల్లితో కలసి విశాలమయిన పచ్చికబయళ్ళలో ఆ అడవికి యువరాజు అయిన తన తండ్రిని కలుస్తాడు. అపుడే మొదటిసారి మానవుడి గురించి తెలుసుకుంటుంది. తన తల్లితో కలసి గడ్డి తింటుడగా బ్యాంబి తల్లి ఒక వేటగాడు అటువైపు రావడం పసిగట్టి బ్యాంబిని పారిపొమ్మని చెప్తుంది. ఇద్దరూ పరుగెడుతుండగా తుపాకి పేలుతుంది. బ్యాంబి తన తల్లికోసం ఎదురు చూసి అడవి అంతా గాలిస్తుండగా తండ్రి వచ్చి ఆమె ఇక లేదని చెప్పి వెళ్ళిపోతాడు. పెద్దవాడయిన తర్వాత బ్యాంబి తన చిన్ననాటి స్నేహితులను తిరిగి కలుసుకుంటాడు. ఫలైన్ అనే మరో ఆడజింకతో జతకడతాడు. తాను పిరికివాడు అనుకొనే బ్యాంబి ఒకరోజు ఫలైన్ కోసం మరొక జింకతో పోరాడి కొండపైన నుండి నదిలోకి తోసివేస్తాడు. ఆ రోజు రాత్రి పొగ వాసన వల్ల నిద్ర లేచిన బ్యాంబితో మానవుడు అడవికి నిప్పు పెట్టాడని అక్కడినుండి తప్పించుకొని వెళ్ళమని చెప్తాడు తండ్రి . వెంటనే ఫలైన్ కోసం బయలుదేరి వేట కుక్కలతో వెంటాడబడుతున్న ఫలైన్‌ని రక్షించి సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్తాడు. కొద్ది రోజులకు ఫలైన్ కవల జింకలకు జన్మనిస్తుంది. బ్యాంబి కొండ పైన నిలబడి చూస్తుండగా తండ్రి అక్కడినుండి వెళ్ళిపోతాడు.

నిర్మాణం

మార్చు

యానిమేషన్ చిత్రం అయినా సహజంగా ఉండాలని వాల్ట్ డిస్నీ ఎంతో శ్రమించాడు. ఆరిస్టులు జంతు నిపుణుల దగ్గర విషయలు తెలుసుకొనేవారు. బ్యాంబి, ఫలైన్ అనే పేరు గల రెండు జింకలను స్టుడియోకు తీసుకువచ్చి వాటి కదలికను చూసి బొమ్మలు గీసేవారు. కళ కోసం చిత్రకారులు వెర్మాంట్, మైన్ రాష్ట్రాల్లోని అడవుల్లో తిరిగి అక్కడి జింకలను, సహజదృశ్యాలను చిత్రీకరించారు.

స్పందన

మార్చు

ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఎంతో గొప్ప విజయం సాధించింది. అయినప్పటికీ బ్యాంబి తల్లి మరణం, తుపాకి కాల్పులు, వేట కుక్కలు మొదలయిన దృశ్యాలు చిన్నపిల్లల సినిమాలో చూపించరాదని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ చిత్రం మ్యూజిక్, రికార్డింగ్ విభాగాలో మూడు ఆస్కార్ అవార్డులకు ఎన్నికయింది. అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ 10 టాప్ 10 చిత్రాలు జాబితాలో యానిమేషన్ విభాగంలో 3వ స్థానంలో నిలిచింది.

మూలాలు

మార్చు
  1. Kevin Jackson 'Tears of a fawn', The Independent, February 6, 2005.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=బ్యాంబి&oldid=4203343" నుండి వెలికితీశారు
  NODES