షహాద
షహాద లేదా కలిమయె షహాద లేదా కలిమా (అరబ్బీ మూలం) అనగా విశ్వాసం, సాక్షి లేదా నమ్మకం. ఇస్లాం మతంలో దేవుడి (అల్లాహ్) పై, అతడిచే అవతరింపబడ్డ ప్రవక్తపై వ్యక్తపరచే విశ్వాసాన్నే షహాద అంటారు. కలిమయె షహాద అనగా విశ్వాసవచనం.
ఇస్లామీయ అఖీదా వ్యాసాల క్రమం:
| |
ఐదు స్థంభాలు (సున్నీ) | |
షహాద - విశ్వాస ప్రకటన | |
విశ్వాసాల ఆరు సూత్రాలు (సున్నీ ముస్లిం) | |
తౌహీద్ - ఏకేశ్వరోపాసన | |
ధార్మిక సూత్రాలు (పండ్రెండుగురు) | |
తౌహీద్ - ఏకేశ్వరోపాసన | |
మతావలంబీకరణ (పండ్రెండు ఇమామ్‌లు) | |
నమాజ్ - ప్రార్థనలు | |
ఏడు స్తంభాలు (ఇస్మాయిలీ) | |
వలాయ - సంరక్షణ | |
ఇతరములు | |
|
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
కలిమయె షహాద "లా ఇలాహ ఇల్లల్లాహు ముహమ్మదుర్ రసూలుల్లాహ్"
అర్థం:
అల్లాహ్ ఒక్కడే దేవుడు, ముహమ్మదు అతడిచే అవతరింపబడ్డ ప్రవక్త.
లా ఇలాహా ఇల్ అల్లాహ్
మార్చుఅరబ్బీ భాషలో అల్లాహ్ అంటే దేవుడు. అల్లాహ్ అనేది అల్+ఇలాహ్ (The+God) అను రెండు పదాలు కలిసిన సంయోగము. లా ఇలాహా ఇల్ అల్లాహ్ అంటే అల్లాహ్ తప్ప వేరే దేవుడు లేడు అని అర్థం. అష్ హదు అన్ లా ఇలాహా ఇల్ అల్లాహ్ అంటే అల్లాహ్ తప్ప వేరే దేవుడు లేడన్న సాక్ష్యాన్ని నేను ప్రవచిస్తున్నాను అని అర్థం.