1689 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1686 1687 1688 - 1689 - 1690 1691 1692
దశాబ్దాలు: 1660లు 1670లు - 1680లు - 1690లు 1700లు
శతాబ్దాలు: 16 వ శతాబ్దం - 17 వ శతాబ్దం - 20 వ శతాబ్దం

సంఘటనలు

మార్చు
  • జనవరి 11: ఇంగ్లాండ్‌లో విప్లవం: 1688 చివరిలో చివరి రోమన్ కాథలిక్ బ్రిటిష్ చక్రవర్తి అయిన రాజు జేమ్స్ II ఫ్రాన్స్‌కు పారిపోయాడు. అతడు సింహాసనాన్ని ఖాళీ చేశాడా లేదా అని తేల్చేందుకు పార్లమెంట్ సమావేశమైంది. దీని పరిష్కారం ఫిబ్రవరి 8 న వచ్చింది.[1]
  • ఫిబ్రవరి 13: విలియం III ఇంగ్లాండ్, స్కాట్లాండ్ లకు, మేరీ II ఐర్లాండుకూ సహ పాలకులుగా ప్రకటించారు.[1]
  • మార్చి 22: ఐర్లాండ్‌లో విలియమైట్ యుద్ధం ప్రారంభం: పదవీచ్యుతుడైన ఇంగ్లాండ్‌ రాజు జేమ్స్ II 6,000 మంది ఫ్రెంచ్ సైనికులతో ఐర్లాండ్‌ చేరుకున్నాడు. అక్కడ కాథలిక్ మెజారిటీ ఉన్నందున, తనకు స్థావరంగా ఉపయోగపడుతుందని భావించాడు.[2] అయితే, చాలా మంది ఐరిష్ కాథలిక్కులు అతన్ని ఫ్రాన్స్‌కు చెందిన లూయిస్ XIV కు ఏజెంట్‌గా భావించారు. దాంతో అతనికి మద్దతు ఇవ్వడానికి నిరాకరించారు.
  • ఏప్రిల్ 11: విలియం III ఇంగ్లాండ్, స్కాట్లాండ్ లకు రాజు గాను, మేరీ II కు ఐర్లాండ్ రాణిగానూ పట్టాభిషేకం చేశారు.[3]
  • మే 24: హక్కుల బిల్లుతో ఇంగ్లాండ్‌లో రాజ్యాంగ రాచరికం ఏర్పాటయింది. కాని రోమన్ కాథలిక్కులు సింహాసనానికి అర్హులు కారంటూ నిరోధించారు.
  • నవంబర్ 22: పీటర్ ది గ్రేట్ చైనాకు గ్రేట్ సైబీరియన్ రహదారి నిర్మాణాన్ని ప్రకటించాడు.
  • ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తన ప్రభావాన్ని విస్తరించుకుంటోంది, భారత ప్రావిన్సులైన బెంగాల్, మద్రాస్, బొంబాయిలలో ప్రెసిడెన్సీలు అని పిలువబడే పరిపాలనా ప్రాంతాల స్థాపనతో, భారతదేశంలో సంస్థ యొక్క సుదీర్ఘ పాలన మొదలైంది

జననాలు

మార్చు

తేదీ వివరాలు తెలియనివి

మార్చు
 
రాణీ మంగమ్మ
  • రాణీ మంగమ్మ తమిళ దేశములో మధుర రాజ్యమునేలిన తెలుగు నాయకుల వంశమునకు చెందిన మహారాణి. (మ.1704)

మరణాలు

మార్చు
  • మార్చి 11: శంభాజీ, మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన ఛత్రపతి శివాజీ పెద్ద కుమారుడు. (జ.1657)

పురస్కారాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 Kenyon, J. P. (1978). Stuart England. Harmondsworth: Penguin Books. ISBN 0-14-022076-3.
  2. Miller, John (2000). James II. Yale English monarchs (3rd ed.). New Haven: Yale University Press. pp. 222–227. ISBN 0-300-08728-4.
  3. Penguin Pocket On This Day. Penguin Reference Library. 2006. ISBN 0-14-102715-0.
"https://te.wikipedia.org/w/index.php?title=1689&oldid=3371157" నుండి వెలికితీశారు
  NODES
Done 1