1722
1722 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1719 1720 1721 - 1722 - 1723 1724 1725 |
దశాబ్దాలు: | 1700లు 1710లు - 1720లు - 1730లు 1740లు |
శతాబ్దాలు: | 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం |
సంఘటనలు
మార్చు: జాకబ్ రోగ్వీన్ ఈస్టర్ ద్వీపంలో అడుగుపెట్టాడు.
- జనవరి 27: మోల్ ఫ్లాన్డర్స్ను ప్రచురించారు.
- మార్చి 8: పర్షియాలో గుల్నాబాద్ యుద్ధం : మహమూద్ హోటక్ నేతృత్వంలోని ఆఫ్ఘనిస్తాన్లోని పష్తూన్ ప్రజలు, పెర్షియన్ సఫావిడ్ రాజవంశపు దళాలను నిర్ణయాత్మకంగా ఓడించి, దాని పతనాన్ని నిర్దేశించారు.
- ఏప్రిల్ 5 ( ఈస్టర్ ఆదివారం ) : డచ్ అడ్మిరల్ జాకబ్ రోగ్వీన్ ఈస్టర్ ద్వీపంపై కాలూనాడు.
- ఫిబ్రవరి 21: మొఘల్ చక్రవర్తి మొహమ్మద్ షా మొదటి అసఫ్ షాను మొఘల్ సామ్రాజ్యానికి ప్రధాన వజీరుగా నియమించాడు.
- జూలై: పీటర్ ది గ్రేట్ పెర్షియాపై చేసిన దండయాత్రతో రష్యా-పర్షియా యుద్ధం (1722–23) ప్రారంభమైంది.
- అక్టోబర్ 23: సఫావిడ్ రాజధాని ఇస్ఫాహాన్ ఆఫ్ఘన్ తిరుగుబాటుదారులకు లొంగిపోవడంతో ఆరు నెలల పాటు సాగిన ఇస్ఫాహాన్ ముట్టడి ముగిసింది. సఫావిద్ సుల్తాన్ హుస్సేన్ తప్పుకుని, మాహమూద్ హోటక్ ను పర్షియా కొత్త షాగా అంగీకరించాడు.
- డిసెంబర్ 20: చైనా చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన పాలన (61 సంవత్సరాలు) తరువాత, కాంగ్జీ చక్రవర్తి మరణించాడు. అతని కుమారుడు యిన్‌జెన్ తరువాత యోంగ్జెంగ్ చక్రవర్తిగా గద్దెనెక్కాడు.
- మెరామిక్ జలాంతర్గత గుహలను కనుగొన్నారు. యునైటెడ్ స్టేట్స్ లోని సెయింట్ లూయిస్ పట్టణానికి తూర్పున మిస్సోరీ నది అడుగున ఈ గుహలు ఏర్పడ్డాయి
జననాలు
మార్చుమరణాలు
మార్చు- ఫిబ్రవరి 10 – బార్తోలోమేవ్ రాబర్ట్స్, వెల్ష్ సముద్రపు దొంగ (జ .1682 )