fast
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియా విశేషణం, quick వడిగా, వేగముగా, త్వరగా.
- firmly బిగువుగా, బిగించి, గట్టిగా, స్థిరముగా.
- do not read so fast అంత వడిగా చదవక.
- not so fast తాళు, తాళు.
- they bound him fast to the pillar వాన్ని స్థంభమునకు బిగించి కట్టినారు.
- I made the boat fast with a rope to a stake ఆ పడవనుదారముతో ఆవాసానికి కట్టిపెట్టినాను.
- he stood fast by his master యజమానుడి పక్కనువుండినాడు, యజమానుడి పక్షములో స్థిరముగా వుండినాడు.
- the troops did not stand fast ఆ సేన నిగ్గలేక పారిపోయినది.
- he stood fast for all this యిందుకంతా వాడు చలించలేదు, వెనుకతియ్యలేదు.
- make the door fastతలుపు గడియ వెయ్యి.
- he was fast asleep వాడు మంచి నిద్రలోవుండినాడు.
- there is a castle fast by the hill ఆ కొండ పక్కనువొక కోట వున్నది, సమీపములో వొక కోట వున్నది.
- noon was then fastapproaching యింతలో రెండు ఝాములు కావచ్చెను.
- summer was now fast approaching యింతలో యెండకాలము తటస్థించినది.
- She is fast growing a woman అది పెద్దమనిషి అయ్యేపక్వంగావున్నది, అది త్వరగా పెద్దమనిషి యౌను.
- the cattle died very fastగొడ్లు నిండా చస్తూ వచ్చినవి.
- these houses are fast falling to decay యీ యిండ్లు నానాటికి ఖిలమైపోతూ వున్నవి.
విశేషణం, firm గట్టిగా వుండే, బిగువుగా వుండే.
- strongబలమైన, ధృఢమైన.
- fast colours నిండుచాయ.
- they made the ropefast to the tree ఆ తాటిని చెట్టుకు కట్టినారు.
- they made him fast to the pillar వాన్ని ఆ స్థంభానికి అంటకట్టినారు.
- a fast place or fort గడి స్థలము కోట.
- quick వేగము గల.
- a very fast horseనిండావడిగా పొయ్యే గుర్రము.
- I cannot believe him he plays fast and loose వాడియందు నిలకడ లేదు వాన్నినమ్మను.
క్రియ, నామవాచకం, ఉపవాసమువుండుట, , ఉపోష్యముండుట, పస్తువుండుట.
- నిరాహారముగా వుండుట.
- to fast by reason of illnessలంఖణము వుండుట, లంఖణము చేసుట.
- to ( as a religious act నిర్జలము చేసుట.
నామవాచకం, s, ఉపవాసము, ఉపోష్యము, పస్తు.
- among the Hindus there is a great in December హిందువులకు ముఖ్యమైన వుపవాసదినము డిశంబరు నెలలో వస్తున్నది.
- a fast ( by reason of illness)లంఖణము.
- a fast of the slightest kind వొక్కపొద్దు.
- he broke hisfast with regard to religious rule పారణ చేసినాడు.
- he broke his fast ( with regard to sickness ) పథ్యముపుచ్చుకొన్నాడు.
- a fast dayఉపవాసదినము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).