give
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file) (file)
క్రియ, నామవాచకం, to yield or to sink.
- లోబడుట.
- వంగుట, కుంగుట.
- give back తొలగివుండండి.
- he gave into their plot వాండ్ల కుట్ర లో వీడున్ను కలిసినాడు.
- he gave into their doctrines వాండ్ల మతము లో పడ్డాడు.
క్రియ, విశేషణం, యిచ్చుట.
- he gave no reason for his conduct వాడు చేసిన దానికి సమాధానము చెప్పలేదు.
- he gave them abuseవాండ్లను తిట్టినాడు.
- he gave an account of this placeయీ స్థలము ను వర్ణించినాడు.
- he gave himself airs అహంకరించినాడు.
- he gave no answer వాడు వుత్తరము చెప్పలేదు.
- exercise gives appetiteతిరగడముచేత ఆకలిపుట్టినది.
- he gave bail for her ఆమెకుపూటబడ్డాడు, ఆమెకు జమీను వుండినాడు.
- to give battle యుద్ధము చేసుట.
- after she gave birth to suspicion యిందువల్ల సందేహము పుట్టినది.
- to give a blow దెబ్బ కొట్టుట.
- will you give mea call to-morrow రేపు మా యింటికి రా.
- he gave his command ఆజ్ఞాపించెను.
- give him my compliments నా సలాము చెప్పు.
- he gave consent to itదానికి సమ్మతించినాడు.
- this gave him courage యిందుచేత వాడికిధైర్యము వచ్చినది.
- he gives no credit to these stories ఆ పిచ్చిమాటలనునమ్మడు.
- he gave a deposition in writing వాజ్మూలము వ్రాయించినాడు.
- to give a disease రోగమునుతగిలించుట.
- this gave them the disease యిందుచేత వాండ్లకు రోగము వచ్చినది.
- he gave ear to them వాండ్లు చెప్పినదాన్నిఆలకించినాడు.
- grinding gives an edge to the razor నూరడముచేత కత్తి కి పదును వస్తున్నది.
- he gave them to the edge of the sword వాండ్లను కత్తిపాలు చేసినాడు.
- he gave her an embrace దాన్నిలకౌగిలించుకున్నాడు.
- he gave them employ వాండ్లను పనిలోపెట్టినాడు.
- he gave evidence సాక్షి చెప్పినాడు.
- give an example of this rule యీ సూత్రము నకు ఉదాహరణ చెప్పు.
- he gave me a fallనన్ను పడద్రోసినాడు.
- they gave him a flogging వాన్ని కొట్టినారు.
- this gives ground for supsicion యిది సందేహానికి ఆస్పదమౌతున్నది.
- he gave them an invitation వాండ్లకు విందు చేసినాడు.
- he gave her a kiss దాన్ని ముద్దు పెట్టుకున్నాడు.
- the horse gave a leap ఆ గుర్రము దుమికినది, గంతులువేసినది.
- to give leave సెలవు యిచ్చుట.
- they gave him this name వాడికి యీ పేరు పెట్టినారు.
- he gave a promise for two hundred rupees యిన్నూరు రూపాయలు యిస్తానన్నాడు.
- to give punishment శిక్షించుట.
- this medicine gave relief యీ మందుచేత గుణముకలిగినది.
- the judge gave sentence న్యాయాధిపతితీర్పు చెప్పినాడు.
- to give a shout బొబ్బలు పెట్టుట, అరుచుట.
- she gave a sigh అది నిట్టూర్పు విడిచినది.
- he gave them the silp వాండ్ల వద్ద నుంచి తప్పించుకొన్నాడు.
- this gives no sound యిది మోగదు,వాగదు.
- he gave his statement in writingచెప్పవలసిన దాన్ని వ్రాసి యిచ్చినాడు.
- to give suck చన్నిచ్చుట.
- to give tongue అరుచుట, కూసుట.
- do not give him trouble వాన్ని తొందరపెట్టక.
- to give vant యెడమిచ్చుట.
- he gave vent to his feelings మనసులోవుండే దాన్ని వెళ్లగక్కినాడు.
- he gave vent to anger ఆగ్రహపడ్డాడు.
- the bridge gave way ఆ వారధి పగిలిపోయినది.
- they gave way before him వాడికి తొలిగినారు.
- the cloth or paper gave way ఆ గుడ్డగానికాగితముగాని చినిగినది.
- the troops did not give way సేన వెనకతీయలేదు.
- the rope gave way తాడు తెగిపోయినది, పూడినది.
- his health gave away వాడికి వొళ్లు కుదురులేదు.
- he gleaned upon the table and it gave way మేజమీద ఆనుకొన్నందున అదివొరిగినది.
- by reason of the rain the floor gave wayవానవిళ్లు నిలిచినందున తళవరస అనగా పరిచిన రాళ్లు కుంగినది,దిగబడ్డది.
- the nail gave way ఆ చీల వూడినది.
- they gave way to ill will కార్పణ్యమును వహించినారు.
- he gave me his word for it అందుకు నేను వున్నానన్నాడు.
- Pharasesgive me a man who would act thus యిట్లా చేసేవాడెవడో చూపు.
- give me to know the truth నాకు నిజమును తెలియచెయ్యి.
- I have given him to know that he must pay నీవు చెల్లించవలసినదనివాడికి తెలియచేసినాను.
- Four villages at 200 men each gives 800 గ్రామమువొకటింటికి యిన్నూరు మంది చొప్పున నాలుగు వూళ్లకు యెనమన్నూరుమంది అవుతున్నారు.
- with prepositions to give away యిచ్చివేసుట.
- the flower gives forth it s smell ఆ పుష్పము వాసన కొట్టుతున్నది.
- the diamond gives forth light ఆ వజ్రము మెరుస్తున్నది.
- he gave out or supplied rice to the army వాడు బియ్యమును దండుకు వేసినాడు.
- he gave out or cicrulated that the king was dead రాజు చచ్చినాడనివదంతిని పుట్టించినాడు.
- he gave over the business ఆ పనినిమానుకున్నాడు.
- the doctor gave the patient over వైద్యుడు,ఆ రోగిని చెయ్యి విడిచిపెట్టినాడు.
- he gave up the money to the robbers ఆ రూకలను దొంగలకు ధారపోసినాడు .
- he gave up his life ప్రాణమును విడిచినాడు.
- at last he gave up the business తుదకు ఆ పనిని మానుకొన్నాడు.
- he gave up the idea ఆశను వదులుకొన్నాడు.
- he gave himself up for last వాడు నిరాశ చేసుకొన్నాడు.
- he gave the money up for lost ఆ రూకలు పోయినదానితో జమగా యెంచుకొన్నాడు.
- she gave herself up to tears అది వూరికే యేడవసాగినది.
- he gave himself up to study చదువుమీద పడ్డాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).