బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, గౌరవము, ప్రతిష్ఠ, మానము, మర్యాద.

  • he treated them with much honour వాండ్లకు నిండా మర్యాద చేసినాడు.
  • she lost her honour అది చెడిపోయినది.
  • he was an honour to his tribe ఆ కులానికి వాడు భూషణముగా వుండినాడు.
  • a man of honour మానస్థుడు, ప్రామాణికుడు.
  • he is bound in honour to tell the truth నిజము చెప్పకపోతే వాడేమి పెద్ద మనిషి.
  • the post of honour యుద్ధములో రొమ్ము యిచ్చి నిలువవలసిన స్థలము.
  • the seat of honour గౌరవస్థలము, పరిహాసముగా ముడ్డి, పిరుదు.
  • do me the honour to come tomorrow తమరు దయచేసి రేపటికి రావలెను.
  • they did him honour వాడికి సన్మానము చేసినారు.
  • I have the honour to acknowledge your letter తమ జాబు చేరి శిరసావహించినాను.
  • word of honour పెట్టిన ఆన, సత్యసంధుడై చెప్పిన మాట.
  • upon my honour I did not believe it నేను దాన్ని నమ్మలేదు సుమీ.
  • he pledged his honour that this was true ఇది నిజము కాకపోతే తన పెద్ద మనిషి తన మేమన్నాడు.
  • I hope your honour will excuse me తమరు నన్ను మన్నించవలెను.
  • His honour ఆయన, దొరగారు.
  • Their honours వారు, దెరలు, ఈ మాటలు ముఖ్యముగా పోలీసు దొరలను గురించి ప్రయోగించబడుతున్నవి.
  • His honour ordered they should be released వాండ్లను విడుదల చేయుమని పోలీసు వారి వుత్తరవు అయినది.
  • it is not there your honour అక్కడ లేదండి, అక్కడలేదయ్యా.
  • Please your honour he is goneఅయ్యా వాడు పోయినాడు.
  • they paid him the last honours వాడికి కర్మాంతములు చేసినారు.
  • in honour of his brother అన్నగారి పేరుబెట్టి.
  • he held a feast in honour of his brothers arrival అన్న వచ్చిచేరినాడని విందు చేసినాడు.
  • a festival in honour of Rama శ్రీరామోత్సవము.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=honour&oldid=934133" నుండి వెలికితీశారు
  NODES
languages 1
os 2