బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, a pit of water బావి, కూపము, నుయ్యి.

క్రియా విశేషణం, justly; rightly, properly, skilfully, perfectly,fully సరిగా, న్యాయముగా, క్రమము గా, బాగా, నేర్పుగా, చక్కగా,లెస్సగా.

  • the trees are well watered ఆ చెట్లకు నీళ్ళు బాగాకట్టినారు.
  • I like it well అది నాకు బాగా వున్నది.
  • they speak well of him వాణ్ని శ్లఘిస్తారు.
  • this house can well hold thirty people ఈ యింట్లో ముప్పైమంది హాయి గా వుండవచ్చును.
  • he knows the language well enough వాడికి యీ భాష యథోచితము గా వచ్చును, అయినమట్టుకు వచ్చును.
  • I dont well remember నాకు జ్ఞాపకము చాలదు.
  • he is well వాడు క్షేమముగా వున్నాడు.
  • he is pretty well వాడు యధోచితముగా వున్నాడు.
  • he did well to us వాడు మాకు క్షేమము చేసినాడు.
  • you did well in telling him నీవు వాడితో చెప్పినది మంచిది.
  • you said well నీవు చెప్పినది న్యాయమే.
  • it turned out well సఫలమైనది.
  • it did not turn out well చెడినది, విఫలమైనది.
  • it is well that you arrived so soon నీవు అంత శీఘ్రము గా వచ్చి చేరినది మంచిదే,నీవు యింత వేగిరము గా రావడము ముఖ్యమే.
  • well done! బాగాయె, శాబాసు.
  • wellthen సరేగదా, మెట్టు కు.
  • well begone వెళ్ళుమరి, సరే వెళ్ళు.
  • very well సరి, మంచిది.
  • he is very well with the prince వాడి మీద రాజుకు అభిమానము నిండా వున్నది.
  • well nigh well కొంచెము తక్కువ.
  • when he was well nigh dead వాడు కొన ప్రాణము తో వుండగా.
  • when the work was well nigh done ఆ పని ముగియవచ్చేటప్పటికి.
  • they are well off వాండ్లు క్షేమముగా వున్నారు.
  • he keeps a strict watch over the orchard and well he may ఫలవృక్షముతోట మీద బహుపదిలము గా కాచుకొని వున్నాడు, వాడు అట్లా వుండవలసినదే.
  • I was there as well as they వాండ్ల తోటిపాటు నేను అక్కడ వుండినాను.
  • it will be as well to tell him అతడి తో చెప్పితే మంచిది.
  • he as well as you must come నీవున్ను రావలసినది వాడున్ను రావలసినది.
  • you as well as he are wrong వాడూ తప్పినాడు నీవూ తప్పినావు.
  • I did it as well as I I could నాచేతనైనమట్టుకు చేసినాను.
  • you had as well goనీవు అక్కడికి పోకపోతివా చూడు.
  • he had as well pay the money వాడు రూకలు చెల్లించకపోతే చూడు.
  • well is him వాడు సుఖము గా వున్నాడు (ఇది పాత ఇంగ్లీషు. )
  • inerj, మంచిది, సరే.
  • well, now you may go సరే, యికను నీవుపోవచ్చును.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=well&oldid=949609" నుండి వెలికితీశారు
  NODES
Done 3